Share News

కుప్పకూలిన భవనం

ABN , Publish Date - Jun 04 , 2024 | 01:48 AM

వన్‌టౌన్‌లో శిథిలావస్థకు చేరిన భవనం ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నానిపోయి సోమవారం ఉదయం కుప్పకూలింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలివి...గొల్లవీధిలో రామాలయం సమీపాన పాత భవనంలో కాశీ అనే వ్యక్తి కుటుంబంతో నివాసముంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ భవనం బాగా నానిపోయింది.

కుప్పకూలిన భవనం
వన్‌టౌన్‌ గొల్లవీధిలో కుప్ప కూలిన పాత భవనం

ముందుగా గుర్తించి బయటకు వచ్చిన కుటుంబ సభ్యులు

త్రుటిలో తప్పిన ప్రాణహాని

శిథిల భవనాల కూల్చివేతలో జీవీఎంసీ నిర్లక్ష్యం

పూర్ణామార్కెట్‌, జూన్‌ 3:

వన్‌టౌన్‌లో శిథిలావస్థకు చేరిన భవనం ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నానిపోయి సోమవారం ఉదయం కుప్పకూలింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలివి...గొల్లవీధిలో రామాలయం సమీపాన పాత భవనంలో కాశీ అనే వ్యక్తి కుటుంబంతో నివాసముంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ భవనం బాగా నానిపోయింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం భవనం కూలిపోయింది. అయితే, ప్రమాదాన్నిముందుగా గుర్తించిన కాశీ కుటుంబం ఇంటి నుంచి ముందే బయటకు వచ్చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ భవనం తమ పూర్వీకులు మట్టితో నిర్మించినట్టు కాశీ తెలిపారు. అయితే, ఆర్థిక స్థోమత లేక ఏళ్ల తరబడి అందులోనే నివాసముంటున్నట్టు ఆయన చెప్పారు. జనావాసాల మధ్య ఉన్న ఇల్లు కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. వన్‌టౌన్‌లో శిథిలావస్థలో ఉన్న పాత భవనాలను కూల్చివేయడంలో జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అఽఽధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్టు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jun 04 , 2024 | 01:48 AM