Share News

చిటికెలో కాఫీ సమాచారం

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:18 PM

గిరిజన కాఫీ రైతుల వాణిజ్య ప్రగతి కోసం కేంద్ర కాఫీ బోర్డు సుమారు రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ‘కాఫీ కృషి తరంగ సేవ’ కాల్‌ సెంటర్‌ విశేష సేవలు అందిస్తోంది. కాల్‌ సెంటర్‌కు రైతులు మిస్డ్‌కాల్‌ చేస్తే సాగులో మెలకువలు, సలహాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ ధరల వివరాలను చిటికెలో అందిస్తోంది. 24 గంటలూ దీని సేవలు అందుబాటులో ఉంటాయి.

చిటికెలో కాఫీ సమాచారం
కాఫీ కృషి తరంగ సేవ కాల్‌ సెంటర్‌ బ్రోచర్‌

‘కాఫీ కృషి తరంగ సేవ’ కాల్‌ సెంటర్‌ సేవలు భేష్‌

సకాలంలో కాఫీ రైతులకు సాగులో మెలకువలు, సలహాలు,

ప్రాంతీయ, అంతర్జాతీయ ధరల వివరాలు

మిస్డ్‌కాల్‌తో ఉచిత సేవలందిస్తున్న కేంద్ర కాఫీ బోర్డు

చింతపల్లి, డిసెంబరు 31:

గిరిజన కాఫీ రైతుల వాణిజ్య ప్రగతి కోసం కేంద్ర కాఫీ బోర్డు సుమారు రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ‘కాఫీ కృషి తరంగ సేవ’ కాల్‌ సెంటర్‌ విశేష సేవలు అందిస్తోంది. కాల్‌ సెంటర్‌కు రైతులు మిస్డ్‌కాల్‌ చేస్తే సాగులో మెలకువలు, సలహాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ ధరల వివరాలను చిటికెలో అందిస్తోంది. 24 గంటలూ దీని సేవలు అందుబాటులో ఉంటాయి.

గిరిజన ప్రాంతంలో 1960-70 ప్రాంతంలో కేంద్ర కాఫీ బోర్డు శాస్త్రవేత్త రాఘవేంద్ర ప్రయోగాల కృషి ఫలితంగా జిల్లాలోని పాడేరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో గిరిజన రైతులు సంప్రదాయేతర పంటగా కాఫీని సాగుచేస్తున్నారు. జిల్లాలో గిరిజన రైతులు 2.58 లక్షల ఎకరాలు, ఏపీఎఫ్‌డీసీ 8,500ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతున్నారు. కాఫీ సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు ఐటీడీఏ గిరిజన రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నది. కాఫీ రైతులు పంటలో నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు, వాణిజ్య ప్రగతి సాధించేందుకు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కృషి చేస్తున్నారు.

సెల్‌ఫోన్‌ ద్వారా ‘కాఫీ కృషి తరంగ సేవ’

కేంద్ర కాఫీ బోర్డు అధికారులు సెల్‌ఫోన్‌ ద్వారా ‘కాఫీ కృషి తరంగ సేవ’ కాల్‌ సెంటర్‌ సేవలు అందిస్తున్నారు. రైతులు 080-37685003 నంబరుకి మిస్డ్‌కాల్‌ చేస్తే చాలు వెంటనే కాల్‌ సెంటర్‌ నుంచి తిరిగి ఫోన్‌ వస్తుంది. తెలుగు భాషలోనే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. కాల్‌ సెంటర్‌ రికార్డు వాయిస్‌ను రైతులు జాగ్రత్తగా విని అవసరమైన ఆప్షన్‌ ఎంచుకోవాల్సి వుంటుంది. కాల్‌ సెంటర్‌ నుంచి వచ్చిన కాల్‌ రిసీవ్‌ చేసుకున్న తరువాత రైతు ఒకటి నంబరును నొక్కి కాఫీ బోర్డు అధికారులను అడగదలుచుకున్న ప్రశ్నలను రికార్డు చేయవచ్చు. ఈ విధంగా అడిగిన ప్రశ్నకు కాఫీ బోర్డు అధికారులు తిరిగి కాల్‌ చేసి రైతులకు సమాధానం ఇస్తారు. రెండును నొక్కితే కాఫీ సాగులో ప్రస్తుత సీజన్‌లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, సాగులో మెలకువలను శాస్త్రవేత్తలు తెలియజేస్తారు. మూడో నంబరును నొక్కితే కాఫీ పార్చిమెంట్‌, చెర్రీ(గుళ్ల) ప్రాంతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను తెలుసుకోవచ్చు. నాలుగును నొక్కితే గతంలో కాఫీ బోర్డు అధికారులను అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను తిరిగి వినే అవకాశముంది. ఈ సేవలను కాఫీ రైతులు బాగా వినియోగించుకుంటున్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:18 PM