వలంటీర్ల వాట్సాప్ గ్రూపులో సీఎం ప్రసంగం
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:21 AM
విశాఖపట్నం అధికారులు మరో విచిత్ర ప్రయోగం చేశారు.

విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం అధికారులు మరో విచిత్ర ప్రయోగం చేశారు. ‘విజన్ విశాఖ’ పేరిట ఏర్పాటుచేసిన సదస్సులో సీఎం జగన్ చేసిన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలను వలంటీర్ల వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయించారు. ‘ఎన్నికల తరువాత విశాఖలో ఉంటా. ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా’ అనే మాటలను నగరంలోని వలంటీర్లు అంతా వారి గ్రూపుల్లో పెట్టాలని ఆదేశించారు. నెల రోజుల క్రితమే వలంటీర్లు వారి పరిధిలోని 50 ఇళ్ల యజమానులతో ‘వలంటీర్స్ గ్రూపు’ ఒకటి క్రియేట్ చేశారు. అందులో వైసీపీకి చెందిన అంశాలనే పోస్ట్ చేస్తున్నారు. తాజాగా మంగళవారం సీఎం ప్రసంగం క్లిప్పింగ్ పోస్ట్ చేశారు.