Share News

ఉద్యోగుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్‌

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:06 AM

ముఖ్యమంత్రి జగన్‌ ఉద్యోగుల పక్షపాతి అని మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ఆదివారం సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి మున్సిపల్‌ ఉద్యోగుల ప్రథమ మహాసభ నిర్వహించారు.

ఉద్యోగుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్‌

సిరిపురం,జనవరి 7 : ముఖ్యమంత్రి జగన్‌ ఉద్యోగుల పక్షపాతి అని మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ఆదివారం సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి మున్సిపల్‌ ఉద్యోగుల ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 మున్సిపల్‌ కార్పొరేషన్లలోని అన్ని విభాగాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రధానమైన డిమాండ్లను ముఖ్యమంత్రి జగన్‌ త్వరలోనే చర్చించి సానుకూలంగా పరిష్కారయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ ఉద్యోగుల ద్వారా ఆయా సమస్యలు వేగంగా నెరవేర్చాలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వంలో భాగమే ఉద్యోగులని, వారి డిమాండ్లు పరిష్కరించేందుకు సబ్‌ కమిటీ ద్వారా పూర్తయ్యేలా చూస్తామన్నారు. మున్సిపల్‌ విభాగంలో కొన్ని కేటగిరీలైన పారిశుధ్యం, అండర్‌ గ్రౌండ్‌ తదితర విబాగాలకు చెందిన అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులతో ఇతర కార్మికులు పోల్చుకోవద్దని, వారు చేసిన పని ఎంతో గొప్పదన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.సుమారు 11 అంశాలను మంత్రులకు చదివి వినిపించారు. ఏపీ జేఏసీ జనరల్‌ సెక్రటరీ పలిశెట్టి దామోదరావు మాట్లాడుతూ ఉద్యోగుల ఐక్యత ద్వారా మనమంతా హక్కులను సాధించుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఈశ్వర్‌ దొప్పలపూడి, ప్రధాన కార్యదర్శి అక్కరబోయిన అప్పలరాజు, వీవీ వామనరావు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి సిరిపురం గురజాడ వరకు ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Jan 08 , 2024 | 01:06 AM