Share News

సాంకేతిక నైపుణ్యంతో సైబర్‌ నేరాలకు చెక్‌

ABN , Publish Date - Nov 09 , 2024 | 12:46 AM

కంప్యూటర్‌ నైపుణ్యం, మెలకువలతో సైబర్‌ మోసాలను సులువుగా ఛేదించవచ్చునని జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా అన్నారు. సైబర్‌ నేరాల దర్యాప్తులో మెలకువలు, ఎప్పటికప్పుడు కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు, నైపుణ్యం పెంపుపై అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైబర్‌ మోసాల కేసులు, సోషల్‌ మీడియా కేసుల దర్యాప్తునకు సంబంధించి ప్రత్యేక టూల్స్‌ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని, నేరానికి పాల్పడిన ప్రదేశాన్ని గుర్తించవచ్చునన్నారు. దర్యాప్తునకు ఉపయోగపడే సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా సైబర్‌ నేరాలను త్వరగా కనిపెట్టి, కేసులను వేగంగా ఛేదించివచ్చని చెప్పారు. సైబర్‌ మోసాలకు గురైన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. సొమ్ము బదిలీని ఆపి, వెనక్కు రప్పించే అవకాశం వుంటుందన్నారు.

సాంకేతిక నైపుణ్యంతో సైబర్‌ నేరాలకు చెక్‌
సమావేశంలో మాట్లాడుతున్న తుహిన్‌ సిన్హా

భవిష్యత్తులో చోరీలకన్నా సైబర్‌ మోసాలే అధికంగా ఉంటాయి

బాధితులు వెంటనే ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చు

జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి, అల్లూరి జిల్లాల పోలీసు అధికారులకు శిక్షణ

అనకాపల్లి టౌన్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): కంప్యూటర్‌ నైపుణ్యం, మెలకువలతో సైబర్‌ మోసాలను సులువుగా ఛేదించవచ్చునని జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా అన్నారు. సైబర్‌ నేరాల దర్యాప్తులో మెలకువలు, ఎప్పటికప్పుడు కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు, నైపుణ్యం పెంపుపై అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైబర్‌ మోసాల కేసులు, సోషల్‌ మీడియా కేసుల దర్యాప్తునకు సంబంధించి ప్రత్యేక టూల్స్‌ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని, నేరానికి పాల్పడిన ప్రదేశాన్ని గుర్తించవచ్చునన్నారు. దర్యాప్తునకు ఉపయోగపడే సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా సైబర్‌ నేరాలను త్వరగా కనిపెట్టి, కేసులను వేగంగా ఛేదించివచ్చని చెప్పారు. సైబర్‌ మోసాలకు గురైన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. సొమ్ము బదిలీని ఆపి, వెనక్కు రప్పించే అవకాశం వుంటుందన్నారు.

అనకాపల్లి జిల్లాలో సైబర్‌ నేరాలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక కోటి 20 లక్షల రూపాయలను ఫ్రీజ్‌ చేశామని, సంబంధిత కోర్టుల ద్వారా త్వరలో బాధితులకు అందజేస్తామని ఎస్పీ చెప్పారు. రానున్న రోజుల్లో చోరీల కన్నా సైబర్‌ మోసాల ద్వారా ప్రజలు ఎక్కువ మొత్తంలో నగదు పొగొట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. వివిధ రూపాల్లో జరిగే సైబర్‌ మోసాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. దర్యాప్తు అధికారులకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు సైబర్‌ నిపుణులు సాయిరామానుజ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టామన్నారు. సైబర్‌ మోసాలు, నేరాల కేసులను దర్యాప్తు చేసే అధికారులు ఈ శిక్షణ ద్వారా సాంకేతికత నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని భవిష్యత్తులోసైబర్‌ క్రైమ్‌కు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ తుహీన్‌ సిన్హా పిలుపునిచ్చారు.

సైబర్‌ నిపుణులు సాయిరామానుజ మాట్లాడుతూ, సైబర్‌ మోసాలను ఛేదించడం చాలా సులువని, దర్యాప్తు అధికారులకు ఇందుకు అవసరమైన అవగాహన, వృత్తి నైపుణ్యంఅవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ బి.అప్పారావు, అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, నర్సీపట్నం డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన్‌, సోషల్‌ మీడియా ఇన్‌స్పెక్టర్‌ టి.కల్యాణి, ఐటీ కోర్‌ ఎస్‌ఐ బి.సురేశ్‌బాబు, రెండు జిల్లాలకు చెందిన పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 12:46 AM