Share News

నాలుగు పోలింగ్‌ కేంద్రాల మార్పు

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:45 AM

రానున్న సార్వత్రిక ఎన్నికలకు నాలుగు పోలింగ్‌ కేంద్రాలను మార్పు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని యు.చీడిపాలెం పంచాయతీ రేవులకోట, ఎం.భీమవరం పంచాయతీ పీఎల్‌ కొత్తూరు పోలింగ్‌ కేంద్రాలను పలకజీడి జీపీఎస్‌ పాఠశాలలో, అలాగే బూదరాళ్ల పంచాయతీ కన్నవరం కేంద్రాన్ని గరిమండకు, కునుకూరు కేంద్రాన్ని బాలరేవులకు మార్చాలని అధికారులు నిర్ణయించారు.

 నాలుగు పోలింగ్‌ కేంద్రాల మార్పు
రేవులకోట పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసే పలకజీడి జీపీఎస్‌ పాఠశాల

- భద్రత కారణాల దృష్ట్యా నిర్ణయం

కొయ్యూరు, ఫిబ్రవరి 29: రానున్న సార్వత్రిక ఎన్నికలకు నాలుగు పోలింగ్‌ కేంద్రాలను మార్పు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని యు.చీడిపాలెం పంచాయతీ రేవులకోట, ఎం.భీమవరం పంచాయతీ పీఎల్‌ కొత్తూరు పోలింగ్‌ కేంద్రాలను పలకజీడి జీపీఎస్‌ పాఠశాలలో, అలాగే బూదరాళ్ల పంచాయతీ కన్నవరం కేంద్రాన్ని గరిమండకు, కునుకూరు కేంద్రాన్ని బాలరేవులకు మార్చాలని అధికారులు నిర్ణయించారు. అయితే పీఎల్‌ కొత్తూరు కేంద్రాన్ని మార్పు చేయడం వల్ల పెదలంక, పుట్టకోట, మందపల్లి తదితర గ్రామాల ప్రజలు ఓటు వేయాలంటే సుమారు 20 కిలోమీటర్లు మేర దట్టమైన అటవీ ప్రాంతం నుంచి నడిచి రావాలి. 2004, 2014 సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సమయంలో మావోయిస్టులు పలకజీడి పోలింగ్‌ కేంద్రంపై దాడి చేయడం, బ్యాలెట్‌ బాక్సులు ఎత్తుకుపోవడం, సిబ్బందికి ఏర్పాటు చేసిన జీపును కాల్చివేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. 2004, 2014 ఎన్నికల సమయంలో పలకజీడి నైసర్గిక స్థితి ప్రస్తుతం రేవులకోట, పీఎల్‌ కొత్తూరు పరిస్థితి ఒకేలా ఉండడంతో గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ రెండు కేంద్రాలను పలకజీడిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈసారి కొత్తగా ఏర్పాటు చేస్తున్న కన్నవరం, కునుకూరు కేంద్రాలను మావోయిస్టు సమస్య నేపథ్యంలో కన్నవరం కేంద్రాన్ని గరిమండకు, కునుకూరు కేంద్రాన్ని బాలరేవులకు తరలించినట్టు తహసీల్దారు రాజేశ్వరావు తెలిపారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని వాటిని మార్పు చేయాలనే ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు తహసీల్దారు వివరించారు.

Updated Date - Mar 01 , 2024 | 12:45 AM