చంద్రబాబు సభకు చకచకా ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:15 PM
అరకుకు సమీపంలో జైపూర్ జంక్షన్ వద్ద ఈ నెల 20న నిర్వహించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు ఏజెన్సీకి వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
శరవేగంగా పనులు
భద్రత ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు
అరకులోయ, జనవరి 18: అరకుకు సమీపంలో జైపూర్ జంక్షన్ వద్ద ఈ నెల 20న నిర్వహించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు ఏజెన్సీకి వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయం సీఐ రుద్రశేఖర్, స్థానిక ఎస్‌ఐలు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం పాడేరు ఏఎస్‌పీ కె.ధీరజ్ కూడా పరిశీలన జరిపారు. సభ ఏర్పాట్లు, తదితర వివరాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అరకు అసెంబ్లీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావును అడిగి తెలుసుకున్నారు. కాగా సభా వేదిక, బారికేడ్లు, హెలీప్యాడ్ పనులు, పార్కింగ్‌కు స్థలం తదితర ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దువ్వారపు రామారావుతో పాటు మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, అరకు పార్లమెంట్ ఇన్‌చార్జి కిడారి శ్రావణ్‌కుమార్, అరకు అసెంబ్లీ ఇన్‌చార్జి దొన్నుదొర పనులను పర్యవేక్షించారు. అరకులోయ, డుంబ్రిగుడ మండలాల పార్టీ నాయకులు పనుల్లో నిమగ్నమయ్యారు.