Share News

గంజాయి స్మగ్లర్‌ అరెస్టు

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:19 AM

ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి రవాణా చేస్తూ విక్రయాలకు పాల్పడుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన స్మగ్లర్‌ అనిల్‌ను అరెస్టు చేసి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సెబ్‌ పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.

గంజాయి స్మగ్లర్‌ అరెస్టు
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి బస్తా

18 కిలోలు స్వాధీనం

పెందుర్తి, మార్చి 5: ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి రవాణా చేస్తూ విక్రయాలకు పాల్పడుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన స్మగ్లర్‌ అనిల్‌ను అరెస్టు చేసి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సెబ్‌ పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కేరళ రాష్ట్రం కొల్లం ప్రాంతానికి చెందిన అనిల్‌ పలు రాష్ట్రాలకు గంజాయిని ఎగుమతి చేసి విక్రయాలకు పాల్పడుతున్నాడు. ఒడిశాలో విక్రమ్‌సింగ్‌ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి విశాఖ మీదగా కేరళ తరలించి అక్కడ నుంచి బెంగళూరు, తదితర రాష్ట్రాల్లో అమ్ముతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి వస్తుండగా పెందుర్తిలో అనిల్‌ను సెబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి స్మగ్లర్‌ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సరోజదేవి, ఎస్‌ఐ మహేశ్‌, సిబ్బందిని సెబ్‌ డైరెక్టర్‌ బమ్మిడి శ్రీనివాసరావు అభినందించారు.

Updated Date - Mar 06 , 2024 | 12:19 AM