టీడీపీ పాడేరు అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్తగా బుద్ద నాగజగదీశ్
ABN , Publish Date - Apr 30 , 2024 | 01:02 AM
టీడీపీ స్థానిక అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్తగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావును నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ సీనియర్ నేతలను అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు.
పాడేరు, ఏప్రిల్ 29(ఆంధ్ర జ్యోతి): టీడీపీ స్థానిక అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్తగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావును నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ సీనియర్ నేతలను అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లికి చెందిన బుద్ద నాగజగదీశ్వరరావును పాడేరు అసెంబ్లీకి సమన్వయకర్తగా నియమించారు. ఆయన గత ఎన్నికల్లోనూ ఇక్కడ సమన్వయకర్తగా పని చేశారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, నియోజకవర్గంలోని ఇతర సీనియర్ నేతలతో చక్కని సమన్వయం ఉండడంతో పాటు స్థానిక పరిస్థితులపై సైతం నాగజగదీశ్వరరావుకు అవగాహన ఉంది. దీంతో ఆయనైతేనే పాడేరు అసెంబ్లీ స్థానంలో చక్కగా సమన్వయం చేస్తారని పార్టీ అధిష్ఠానం భావించిందని పార్టీ నాయకులు చెబుతున్నారు.