Share News

కేజేపురంలో దారుణ హత్య

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:14 AM

పంట పొలాలు, కళ్లాల వద్ద కాలువ గొడవ విషయమై ఇద్దరి మధ్య నెలకొన్న తగాదా హత్యకు దారితీసింది. దీనికి సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

కేజేపురంలో దారుణ హత్య
సూర్యనారాయణ (ఫైల్‌ ఫొటో)

కాలువ విషయమై ఇద్దరి మధ్య గొడవ

కత్తితో మెడపై నరకడంతో ఒకరి మృతి

మాడుగుల, జూలై 14: పంట పొలాలు, కళ్లాల వద్ద కాలువ గొడవ విషయమై ఇద్దరి మధ్య నెలకొన్న తగాదా హత్యకు దారితీసింది. దీనికి సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలో కస్పాజగన్నాథపురం గ్రామ సమీపం లో గల చెరకు కాటా సమీప కళ్లాల వద్ద ఉన్న కాలువ విషయమై అదే గ్రామానికి చెందిన సూరిశెట్టి సూర్యనారాయణ(70), సూరిశెట్టి నర్సింగరావు(43)ల మధ్య ఆదివారం సాయంత్రం వివాదం చోటుచేసుకుంది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో సూరిశెట్టి నర్సింగరావు తన చేతిలో ఉన్న కత్తితో సూరిశెట్టి సూర్యనారాయణ మెడపై నరికి హతమార్చాడు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో అక్కడకు పరుగులు తీశారు. అయితే ఈ సంఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ దామోదర్‌నాయుడు తెలిపారు. కాగా రాత్రయినా సంఘటన స్థలం వద్దనే మృతదేహం ఉంది.

Updated Date - Jul 15 , 2024 | 12:14 AM