Share News

ఊపందుకున్న వ్యవసాయ పనులు

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:02 PM

జిల్లాలోని పలు మండలాల్లో వరినాట్ల పనులు ఊపందుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పంట పొలాల్లోకి సరిపడా నీరు చేరడంతో, ఇప్పటికే వరి ఆకు పెరిగి ఉన్న పలు గ్రామాల్లో ఆయా రైతులు చకచకా ట్రాక్టర్లతో పొలాల్లో దమ్ము పెట్టించి, తరువాత ఆ పొలాలకు చెందిన గట్లను అందంగా వేసుకొని అనంతరం వరినాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు.

ఊపందుకున్న వ్యవసాయ పనులు
ఎస్‌.రాయవరం మండలం ఉప్పరాపల్లి గ్రామంలో వరినాట్లు వేస్తున్న కూలీలు

వరినాట్లు వేయడంలో రైతులు బిజీ

ఎస్‌.రాయవరం, జూలై 28: జిల్లాలోని పలు మండలాల్లో వరినాట్ల పనులు ఊపందుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పంట పొలాల్లోకి సరిపడా నీరు చేరడంతో, ఇప్పటికే వరి ఆకు పెరిగి ఉన్న పలు గ్రామాల్లో ఆయా రైతులు చకచకా ట్రాక్టర్లతో పొలాల్లో దమ్ము పెట్టించి, తరువాత ఆ పొలాలకు చెందిన గట్లను అందంగా వేసుకొని అనంతరం వరినాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఎస్‌.రాయవరం మండలంలోని సర్వసిద్ధి, ఉప్పరాపల్లి, పెట్టుగోళ్ళపల్లి, పెదగుమ్ములూరు, చినగుమ్ములూరు తదితర గ్రామాల్లో రైతులు వరినాట్ల పనులు మొదలుపెట్టగా, మిగతా గ్రామాల్లో వరినాట్లకు ముందు చేయాల్సిన పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా మండలంలో మొత్తం 3,281 విస్తీర్ణంలో రైతులు వరిసాగు చేస్తున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:02 PM