అందుబాటులోకి బోటు షికారు
ABN , Publish Date - Dec 05 , 2024 | 11:09 PM
గిరిజన మ్యూజియం లోని కళా గ్రామంలో బోటు షికారును ఐటీడీఏ పీవో అభిషేక్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మ్యూజియం క్యూరేటర్ మురళితో కలిసి బోటు షికారు చేశారు.
కళా గ్రామంలో ప్రారంభించిన ఐటీడీఏ పీవో
అరకులోయ, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): గిరిజన మ్యూజియం లోని కళా గ్రామంలో బోటు షికారును ఐటీడీఏ పీవో అభిషేక్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మ్యూజియం క్యూరేటర్ మురళితో కలిసి బోటు షికారు చేశారు. మ్యూజియంలో ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని, ప్లాస్టిక్ మంచినీళ్ల బాటిళ్లను అనుమతించవద్దని సిబ్బందికి సూచించారు. అనంతరం పద్మాపురం గార్డెన్‌లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను పరిశీలించారు. గార్డెన్‌లో త్వరితగతిన విద్యుద్దీపాలంకరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గార్డెన్ మేనేజర్ బొంజిబాబు, తదితరులు పాలొన్నారు,