Share News

‘మందు’ జాగ్రత్త!

ABN , Publish Date - Jun 03 , 2024 | 01:26 AM

నగరంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఆదివారం మందుబాబులు పోటెత్తారు. నాలుగోతేదీన ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సోమవారం నుంచి వరుసగా మూడు రోజులు మద్యం విక్రయాలను అధికారులు నిలిపేస్తున్నట్టు సోషల్‌మీడియాలో గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ముందుజాగ్రత్తగా మద్యం అందుబాటులో ఉంచుకునేందుకు ప్రభుత్వ మద్యం దుకాణాలకు పోటెత్తారు. దీనివల్ల ఆదివారం ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద భారీగా రద్దీ ఏర్పడింది.

‘మందు’ జాగ్రత్త!

కిక్కిరిసిన మద్యం దుకాణాలు

మూడు రోజులు విక్రయాలు ఉండవని ప్రచారం

సరకు నిల్వ చేసుకునేందుకు ఆరాటం

4న మాత్రమే మూసివేస్తామన్న అధికారులు

విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఆదివారం మందుబాబులు పోటెత్తారు. నాలుగోతేదీన ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సోమవారం నుంచి వరుసగా మూడు రోజులు మద్యం విక్రయాలను అధికారులు నిలిపేస్తున్నట్టు సోషల్‌మీడియాలో గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ముందుజాగ్రత్తగా మద్యం అందుబాటులో ఉంచుకునేందుకు ప్రభుత్వ మద్యం దుకాణాలకు పోటెత్తారు. దీనివల్ల ఆదివారం ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద భారీగా రద్దీ ఏర్పడింది.

జిల్లాలో 139 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 128 బార్లలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకరికి ఒకటి, రెండు మద్యం బాటిళ్లు మాత్రమే దుకాణాల్లో విక్రయించేవారు. తాజాగా ఒకరికి మూడు, నాలుగు బాటిళ్లు వరకూ విక్రయిస్తున్నారు. అయితే వరుసగా మూడు రోజులు మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేస్తే మద్యం అందుబాటులో ఉండదనే ప్రచారం నేపథ్యంలో మందుబాబులు ముందుజాగ్రత్తగా సరుకు కొనుగోలు చేసుకున్నారు. కాగా జిల్లా ఎక్సైజ్‌ అధికారులు మాత్రం మూడు రోజులు మద్యం దుకాణాలు మూసివేస్తారనే ప్రచారం వాస్తవం కాదని, కేవలం ఓట్ల లెక్కింపు జరిగే జూన్‌ నాలుగున మాత్రమే మద్యం విక్రయాలు జరగవని స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Jun 03 , 2024 | 01:26 AM