Share News

అంగన్‌వాడీల భిక్షాటన

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:01 AM

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు వై. తులసి డిమాండ్‌ చేశారు.

అంగన్‌వాడీల భిక్షాటన

సిరిపురం, జనవరి 5 :

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు వై. తులసి డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె

మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడు దల చేసిన ప్రకటనలో కనీస వేతనాలను రూ. 26 వేలకు పెంచలేదన్నారు. సమ్మె కార్మికుల హక్కు అని సమస్యలను పరి ష్కరించడం కుదరక అంగన్‌వాడీలను నిర్బంధించడం సరికాదని పేర్కొన్నారు. సర్వశిక్ష అభియాన్‌తో పాటు మూడు లక్షల మంది కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.మణి, జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్‌ గౌరవ అధ్యక్షుడు పి. వెంకటరెడ్డి, మురికివాడల సంఘం, ఎఫ్‌టీయూసీ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 01:01 AM