Share News

మందు కోసం బారులు!

ABN , Publish Date - May 12 , 2024 | 01:24 AM

ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయనుండడంతో శనివారం నగరంలో ఆ దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.

మందు కోసం బారులు!

విశాఖపట్నం, మే 11 (ఆంధ్రజ్యోతి):

ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయనుండడంతో శనివారం నగరంలో ఆ దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. ముందుజాగ్రత్తగా ఆదివారం, సోమవారం నాటి కోసం మద్యం సిద్ధం చేసుకునే క్రమంలో దుకాణాల వద్ద బారులుతీరారు. కాగా, పోలింగ్‌కు 36 గంటల ముందు విక్రయాలు నిలిపివేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ఐదు గంటలకు జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్‌ అధికారులు సీజ్‌ చేశారు. తిరిగి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు దుకాణాలు, బార్లు తెరుచుకుంటాయని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ వి.సుధీర్‌ తెలిపారు.

Updated Date - May 12 , 2024 | 01:24 AM