Share News

బల్యగుడ.. ఏదీ అభివృద్ధి జాడ

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:34 AM

మండలంలోని కొర్రా పంచాయతీ బల్యగుడ గ్రామంలో కనీస సౌకర్యాలు లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో కనీస సౌకర్యాలకు నోచుకోక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు.

బల్యగుడ.. ఏదీ అభివృద్ధి జాడ
అభివృద్ధికి నోచుకోని బల్యగుడ గ్రామం

- కనీస సౌకర్యాలు లేక జనం అవస్థలు

- రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇక్కట్లు

డుంబ్రిగుడ, జనవరి 20: మండలంలోని కొర్రా పంచాయతీ బల్యగుడ గ్రామంలో కనీస సౌకర్యాలు లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో కనీస సౌకర్యాలకు నోచుకోక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామానికి టీడీపీ హయాంలో నిర్మించిన మట్టి రోడ్డు శిథిలావస్థకు చేరడంతో రవాణా కష్టాలు వెంటాడుతున్నాయి. గ్రామస్థులు అనారోగ్యానికి గురైతే అంబులెన్స్‌ గ్రామానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించకపోవడంతో వర్షాకాలంలో వరద నీరంతా ఒకేచోట నిల్వ ఉండిపోతోంది. దీని వల్ల దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ గ్రామంలో సుమారు 25 మంది బాలలు విద్యనభ్యసిస్తున్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన పాఠశాల భవన నిర్మాణం పునాదుల స్థాయిలోనే నిలిచిపోయింది. ప్రభుత్వం నిధులను దారి మళ్లించడంతో పాఠశాల భవనం లేక బాలలు ఆరుబయటే చదువుకుంటున్నారు. వర్ష్షాకాలంలో తరగతుల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమ పిల్లల చదువులు సజావుగా సాగడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికార యంత్రాంగం స్పందించి కనీస సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:34 AM