Share News

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:43 AM

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత తెలిపారు.

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌పై సిబ్బందికి సూచనలిస్తున్న కలెక్టర్‌ విజయసునీత

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత

పాడేరు, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత తెలిపారు. అక్కడికౌంటింగ్‌ ఏర్పాట్లను సోమవారం సాయంత్రం ఆమె స్వయంగా పరిశీలించారు. జిల్లాలో అరకులోయ నియోజకవర్గానికి సంబంధించి 22 రౌండ్లు, పాడేరుకు 23, రంపచోడవరానికి 20 రౌండ్ల లెక్కింపు జరుగుతుందన్నారు. సుమారుగా మూడు వేల మంది సిబ్బంది కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొంటారన్నారు. ఎటువంటి సమస్యలు, అపోహలకు ఆస్కారం లేకుండా కౌంటింగ్‌ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. ఈవీఎం కౌంటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌కు సంబఽంధించిన గదులను పరిశీలించి, కౌంటింగ్‌ సిబ్బందికి కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. కౌంటింగ్‌ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ఆమె వెంట పాడేరు, అరకులోయ ఆర్వోలు భావన వశిష్ఠ, అభిషేక్‌, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, తదితరులున్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:43 AM