Share News

ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

ABN , Publish Date - May 23 , 2024 | 01:11 AM

జిల్లాలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ మేరకు ఆస్పత్రులు యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందుతున్న వారికి చికిత్సలు కొనసాగిస్తామని, కొత్తగా మాత్రం ఎవరినీ చేర్చుకోబోమని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రకటించాయి. గడిచిన కొన్ని నెలల నుంచి బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి.

ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ మేరకు ఆస్పత్రులు యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందుతున్న వారికి చికిత్సలు కొనసాగిస్తామని, కొత్తగా మాత్రం ఎవరినీ చేర్చుకోబోమని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రకటించాయి. గడిచిన కొన్ని నెలల నుంచి బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి.

Updated Date - May 23 , 2024 | 08:13 AM