Share News

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:52 AM

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత సూచించారు.

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ విజయసునీత

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత

పాడేరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత సూచించారు. పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల రిటర్నింగ్‌ అధికారులు అభిషేక్‌, భావనలతో కలిసి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని ఈవీఎంల స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల ఏర్పాట్లను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విజయసునీత మాట్లాడుతూ ఎవరికీ ఎటువంటి అపోహలకు తావులేకుండా ఎన్నికలు, భద్రత, కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్‌ అనంతరం వాటిని స్వీకరించడం, భద్రపరచడం వంటి చర్యలపై అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి.అంబేడ్కర్‌, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ డీవీఆర్‌ఎం.రాజు, డీఈఈ పి.అనుదీప్‌, తహసీల్దార్‌ కల్యాణచక్రవర్తి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:52 AM