Share News

ఓట్ల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - May 22 , 2024 | 12:24 AM

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ సూచించారు. జూన్‌ నాలుగో తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అరకులోయ అసెంబీ ్లస్థానం పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఓట్ల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
మాట్లాడుతున్న అరకులోయ ఆర్వో వి.అభిషేక్‌, పక్కన ఎస్‌డీసీ వీవీఎస్‌ శర్మ

- అరకులోయ రిటర్నింగ్‌ అధికారి వి.అభిషేక్‌

పాడేరు, మే 21(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ సూచించారు. జూన్‌ నాలుగో తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అరకులోయ అసెంబీ ్లస్థానం పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలన్నారు. ఓట్ల లెక్కింపు నిర్వహణ, స్ర్టాంగ్‌ రూమ్‌ల నుంచి కౌంటింగ్‌ హాలుకు ఈవీఎంల తరలింపుపై అధికారులకు అవగాహన కల్పించారు. కౌంటింగ్‌ హాలులో ఈవీఎంలకు 14 టేబుళ్లు, పోస్టల్‌ బ్యాలెట్‌లకు 3 టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్‌ ఏర్పాట్లతో పాటు కౌంటింగ్‌ ప్రక్రియ సైతం ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా జరగాలన్నారు. అలాగే ప్రతి టేబుల్‌ వద్ద సహాయ రిటర్నింగ్‌ అధికారి, సూపర్‌వైజర్‌, మరొక సహాయకుడు ఉంటారన్నారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు కౌంటింగ్‌ ఏర్పాట్లు, కౌంటింగ్‌పై సంపూర్ణమైన అవగాహనతో ఉండాలని సూచించారు. అనంతరం ప్రతి రోజు ఈవీఎంల స్ర్టాంగ్‌ రూమ్‌ల పరిశీలనలో భాగంగా అరకులోయ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు చెందిన ఈవీఎంలు భద్రపరిచిన స్ర్టాంగ్‌ రూమ్‌లను పరిశీలించి, వాటికి వేసిన సీళ్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వీవీఎస్‌.శర్మ, అరకులోయ నియోజకవర్గం పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:24 AM