Share News

యథేచ్ఛగా అనధికార లేఅవుట్లు

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:10 AM

మునిసిపాలిటీ పరిధిలో అనధికార లేఅవుట్లు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. కొందరు రియల్టర్లు నాలా కన్వర్షన్‌ లేకుండానే అనధికార లేఅవుట్లు వేసి విక్రయించేస్తున్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

యథేచ్ఛగా అనధికార లేఅవుట్లు
మునిసిపాలిటీ పరిధి యర్రవరంలో అనధికార లేఅవుట్‌

నాలా కన్వర్షన్‌ లేకుండానే ప్లాట్ల విక్రయాలు

పట్టించుకోని అధికారులు

ఎలమంచిలి, ఆగస్టు 20: మునిసిపాలిటీ పరిధిలో అనధికార లేఅవుట్లు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. కొందరు రియల్టర్లు నాలా కన్వర్షన్‌ లేకుండానే అనధికార లేఅవుట్లు వేసి విక్రయించేస్తున్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మునిసిపాలిటీలో ప్రధానంగా పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీ, యర్రవరం, సోమలింగపాలెం, పెదగొల్లలపాలెం తదితర ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర స్థలంగా మార్పు చేసేందుకు అవసరమైన నాలా కన్వర్షన్‌ ఫీజు చెల్లించుకుండానే లేఅవుట్లు వెలుస్తున్నాయి. ప్లాట్లను దర్జాగా విక్రయించేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై పట్టణ ప్రణాళికాధికారి శ్రీలక్ష్మీని వివరణ కోరగా ఇప్పటికే మునిసిపాలిటీలో అనధికార లేఅవుట్లను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్టీఆర్‌ కాలనీ, యర్రవరం, సోమలింగపాలెం, కట్టుపాలెం, పెదగొల్లల పాలెం ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్టు తెలిపారు..

Updated Date - Aug 21 , 2024 | 12:10 AM