Share News

మరో 23 ఎకరాలు ఫ్రీహోల్డ్‌

ABN , Publish Date - May 30 , 2024 | 01:29 AM

జిల్లాలో పేదలకు ఇచ్చిన డీపట్టా భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని కొద్దిరోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ అధికారులు వాటిని పట్టించుకోకుండా మరిన్ని భూములను ప్రభుత్వ రికార్డుల నుంచి ఫ్రీ హోల్డ్‌ చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆనందపురం మండలం రామవరం రెవెన్యూ పరిధిలోని సుమారు 23 ఎకరాలను కలెక్టర్‌ మల్లికార్జున ఫ్రీహోల్డ్‌ చేయడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

మరో 23 ఎకరాలు ఫ్రీహోల్డ్‌

ఆరోపణలను పట్టించుకోని విశాఖ జిల్లా అధికారులు

విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పేదలకు ఇచ్చిన డీపట్టా భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని కొద్దిరోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ అధికారులు వాటిని పట్టించుకోకుండా మరిన్ని భూములను ప్రభుత్వ రికార్డుల నుంచి ఫ్రీ హోల్డ్‌ చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆనందపురం మండలం రామవరం రెవెన్యూ పరిధిలోని సుమారు 23 ఎకరాలను కలెక్టర్‌ మల్లికార్జున ఫ్రీహోల్డ్‌ చేయడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. రామవరం సర్వే నంబరు 133లో 0.69 ఎకరాలు, 137-డిలో 4.99 ఎకరాలు, 138-డిలో 1.25 ఎకరాలు, 138-6లో 1.09 ఎకరాలు, 139/2లో 2.59 ఎకరాలు, 1394లో 3.07 ఎకరాలు, 164-7లో 3.46 ఎకరాలు, 165-1లో 0.52 ఎకరాలు, 169-2లో 0.87 ఎకరాలు, 169-5లో 3.16 ఎకరాలు,171-5లో 0.54 ఎకరాలు,171-4లో 0.39 ఎకరాలు, 172/6లో 0.94 ఎకరాలు, 172-2లో 0.74 ఎకరాలు, 170-5లో 2.27 ఎకరాలకు సంబంధించి డి.పట్టా భూములను ఫ్రీహోల్డ్‌ చేశారు. డి.పట్టా భూముల క్రమబద్ధీకరణకు వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దానిని అడ్డంపెట్టుకుని ప్రభుత్వంలో పెద్దలు విశాఖ పరిసరాల్లో భూములు కొనుగోలు చేస్తున్నారు.

Updated Date - May 30 , 2024 | 08:42 AM