వ్యాన్ ఢీకొని వృద్ధుడు మృతి
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:21 AM
ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వృద్ధుడిని వ్యాన్ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పెందుర్తి, మార్చి 5: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వృద్ధుడిని వ్యాన్ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేపగుంట సమీపంలోని అప్పన్నపాలేనికి చెందిన ఎస్.ఉమామహేశ్వరరావు (65) ఆర్టీవో ఏజెంట్‌గా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన హోండా యాక్టివాపై వెళుతుండగా సింహాచలం శ్రీనివాసనగర్ సమీపంలోని బాలాజీనగర్ బస్టాప్ వద్ద గోపాలపట్నానికి ఇటుకల లోడ్‌తో వెళుతున్న వ్యాన్ ఢీకొంది. తలకు తీవ్ర గాయాలవ్వడంతో ఉమామహేశ్వరరావు ఘటనా స్థలిలోనే మృతి చెందారు. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.