Share News

అమర్‌కు టికెట్‌ లేనట్టే?

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:07 AM

అనకాపల్లి ఎమ్మెల్యే, ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించేటట్టు లేదు. ఈ విషయంపై గురువారం అనకాపల్లి మండలం పిసినికాడలో నిర్వహించిన ‘చేయూత’ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే స్పష్టత ఇచ్చారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌, మంత్రి గుడివాడ అమర్‌ ఇద్దరూ తనకు తమ్ముళ్లులాంటి వారని, భరత్‌ను ఎమ్మెల్యేగా పోటీకి దింపుతున్నామని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మంత్రి అమర్‌ను గుండెల్లో పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు. అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విషయాన్ని పరోక్షంగా స్పష్టంచేశారు.

అమర్‌కు టికెట్‌ లేనట్టే?

పిసినికాడ సభలో పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన సీఎం

గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ప్రకటన

2019 ఎన్నికల సమయంలో

దాడి రత్నాకర్‌కూ అదే హామీ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి ఎమ్మెల్యే, ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించేటట్టు లేదు. ఈ విషయంపై గురువారం అనకాపల్లి మండలం పిసినికాడలో నిర్వహించిన ‘చేయూత’ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే స్పష్టత ఇచ్చారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌, మంత్రి గుడివాడ అమర్‌ ఇద్దరూ తనకు తమ్ముళ్లులాంటి వారని, భరత్‌ను ఎమ్మెల్యేగా పోటీకి దింపుతున్నామని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మంత్రి అమర్‌ను గుండెల్లో పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు. అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విషయాన్ని పరోక్షంగా స్పష్టంచేశారు.

దాడి వీరభద్రరావు తన తనయుడు రత్నాకర్‌తో కలిసి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అప్పుడు కూడా జగన్‌ ఇదే మాట అన్నారు. రత్నాకర్‌ తన సోదరుడితో సమానమని, గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు ఎక్కడా పోటీ చేసే అవకాశం కల్పించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీనియర్‌ నాయకుడైన వీరభద్రరావుకు గానీ, కుమారుడు రత్నాకర్‌కు గానీ ఎటువంటి పదవి ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో కూడా రత్నాకర్‌ పేరును పరిగణనలోకి తీసుకోకుండా భరత్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో వీరభద్రరావు, రత్నాకర్‌లు కొద్దికాలం క్రితం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. జగన్‌ ‘గుండెల్లో పెట్టుకుంటాను’ అంటే దాని అర్థం ఇలాగే ఉంటుందని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు అంటున్నారు. వాస్తవానికి గుడివాడ అమర్‌నాథ్‌ మంత్రి అయిన తొలిరోజుల్లో మీడియా ముందు చేసిన ‘కోడిగుడ్డు’ వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వచ్చింది. కేవలం జనసేన అధినేతను దూషించడమే పనిగా పెట్టుకోవడంతో సొంత సామాజికవర్గం కూడా ఆయనకు కలిసి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఈసారికి పక్కన పెట్టేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సైనికుడిలా పనిచేస్తా: మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌

ఇదే సభలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం లేకపోయినా సరే సైనికుడిలా జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి పనిచేస్తానని ప్రకటించారు.

Updated Date - Mar 08 , 2024 | 01:07 AM