సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలి
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:01 AM
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు.

నేతలు, కార్యకర్తలకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి
ఎలమంచిలి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. దేశంలోనే ఆదర్శంగా ఉండే రీతిలో పార్టీ సభ్యత్వ నమోదును బాధ్యతగా చేపట్టాలన్నారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన ఎలమంచిలి, రాంబిల్లి మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు ప్రజారంజక పాలనను కూటమి ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల పనితీరు నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ద్వారా ప్రజలకు వర్తించే ఉపయోగాలను వివరించాలన్నారు. ప్రతి నేత, కార్యకర్త సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి దూళి రంగనాయకులు, కర్రి శివ, నానాజీ తదితరులంతా సభ్యత్వ నమోదుపై పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గొర్లె నానాజీ, ఆడారి రమణబాబు, మండల పార్టీ అధ్యక్షులు ఇత్తంశెట్టి రాజు, దిన్‌బాబు, నాయకులు రాజాన సూర్యనాగేశ్వరరావు, కాండ్రకోట చిరంజీవి, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, ఆడారి ఆదిమూర్తి, కొఠారు సాంబ, రాజాన వెంకునాయుడు, నేతలు బొద్దపు శ్రీను, బొద్దపు నాగేశ్వరరావు, నానేపల్లి సుబ్బయ్యనాయుడు, కరణం రవి, గొర్లె బాబూరావు పాల్గొన్నారు.