Share News

డొంకరాయి పవర్‌ కెనాల్‌లో లీకేజీ అడ్డుకట్టకు చర్యలు

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:00 PM

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి పవర్‌ కెనాల్‌లో లీకేజీ అడ్డుకట్ట పనులను శరవేగంగా నిర్వహిస్తున్నట్టు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కేకేవీ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

డొంకరాయి పవర్‌ కెనాల్‌లో లీకేజీ అడ్డుకట్టకు చర్యలు
పవర్‌ కెనాల్‌ లీకేజీ వద్ద గ్రౌటింగ్‌ పనులు చేస్తున్న దృశ్యం

గ్రౌటింగ్‌ ద్వారా నియంత్రించేందుకు శరవేగంగా పనులు

డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి నిలుపుదల

సీలేరు, జనవరి 28: సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి పవర్‌ కెనాల్‌లో లీకేజీ అడ్డుకట్ట పనులను శరవేగంగా నిర్వహిస్తున్నట్టు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కేకేవీ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డొంకరాయి నుంచి పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రానికి నీరు విడుదల చేసే పవర్‌ కెనాల్‌ రీచ్‌-1లో లీకేజీ ఉన్నట్టు తమ సిబ్బంది గుర్తించడంతో ఆదివారం ఎల్‌సీ అనుమతులు తీసుకుని కెనాల్‌ నుంచి నీటి విడుదలను నిలిపివేశామన్నారు. దీని వల్ల 25 మెగావాట్ల సామర్థ్యం గల డొంకరాయి, 460 మెగావాట్ల సామర్థ్యం గల పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తిని కూడా నిలిపి వేసి కెనాల్‌ లీకేజీ ప్రదేశంలో గ్రౌటింగ్‌ పనులను శరవేగంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆదివారం రాత్రికి గౌటింగ్‌ పనులను పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ గ్రౌటింగ్‌ పనులు స్థానిక జెన్‌కో ఇంజనీర్ల పర్యవేక్షణలో జరుగుతున్నాయని, సోమవారం నాటికి కెనాల్‌ను వినియోగంలోకి తీసుకురానున్నామని ఆయన వెల్లడించారు.

Updated Date - Jan 28 , 2024 | 11:00 PM