ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:24 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సోమవారం విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
విజయనగరం జిల్లా పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో రుషికొండపై భవనాలు పరిశీలన
గోపాలపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సోమవారం విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా బాధిత కుటుంబాలను పరామర్శించడానికి విజయవాడ నుంచి ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్‌కు ఎంపీ ఎం.శ్రీభరత్, కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాధ్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ, గ్రేటర్ కమిషనర్ పి.సంపత్‌కుమార్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో విజయనగరం వెళ్లారు. అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో రుషికొండను సందర్శించారు. ఎంపీ ఎం.శ్రీభరత్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, జనసేన నాయకులతో కలిసి ఆ భవనాన్ని బయట నుంచే ఆమూలాగ్రం చూశారు. భవనానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెప్పించుకొని ఏమి చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని పార్టీ నాయకులకు చెప్పారు. అనంతరం ఐదు గంటలకు విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లారు.