Share News

రూ.21 లక్షలో ఉడాయించిన స్టోర్‌ మేనేజర్‌

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:50 AM

చినముషిడివాడలోని విశాల్‌ మార్ట్‌లో స్టోర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రూ.21 లక్షలతో ఉడాయించాడు. సీఐ మరిడాన శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

రూ.21 లక్షలో ఉడాయించిన స్టోర్‌ మేనేజర్‌

పోలీసులకు ఫిర్యాదు చేసిన విశాల్‌ మార్ట్‌ హెడ్‌

పెందుర్తి, జనవరి 16: చినముషిడివాడలోని విశాల్‌ మార్ట్‌లో స్టోర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రూ.21 లక్షలతో ఉడాయించాడు. సీఐ మరిడాన శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాల్‌ మార్ట్‌లో ఒడిశాకు చెందిన అమితాబ్‌ ప్రధాన్‌ అనే వ్యక్తి స్టోర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన రెండు నెలల కిందటే విధుల్లో చేరాడు. కాగా పండగ రోజుల్లో మార్ట్‌లో జరిగిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన నగదును బ్యాంకుకు సెలవులు కావడంతో జమ చేయకుండా మార్ట్‌లోనే భద్రపరిచారు. మంగళవారం మార్ట్‌లో భద్రపరిచిన రూ.21 లక్షలను బ్యాంకులో జమ చేస్తానని చెప్పి అమితాబ్‌ ప్రధాన్‌ అక్కడ నుంచి నగదుతో ఉడాయించాడు. బ్యాంకుకు వెళ్లిన స్టోర్‌ మేనేజర్‌ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో విశాల్‌ మార్ట్‌ హెడ్‌ ఆయనకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో అమితాబ్‌ ప్రధాన్‌ నగదుతో ఉచాయించాడంటూ విశాల్‌ మార్ట్‌ హెడ్‌ అనిల్‌కుమార్‌ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్టు సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:51 AM