Share News

గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం

ABN , Publish Date - Aug 16 , 2024 | 12:48 AM

ఏపీ గ్రేహౌండ్స్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దేవరాపల్లికి చెందిన గొర్లె వెంకటరమణకు అరుదైన గౌరవం లభించింది. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి అత్యంత ప్రతిభా పాటవాలు కనబరిచినందుకు వెంకటరమణకు ప్రెసిడెంట్‌ మెడల్‌ ఫర్‌ గేలంట్రీ పతకం దక్కింది.

గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం
గొర్లె వెంకటరమణను పతకంతో సత్కరిస్తున్న సీఎం చంద్ర బాబునాయుడు

దేవరాపల్లి, ఆగస్టు 15: ఏపీ గ్రేహౌండ్స్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దేవరాపల్లికి చెందిన గొర్లె వెంకటరమణకు అరుదైన గౌరవం లభించింది. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి అత్యంత ప్రతిభా పాటవాలు కనబరిచినందుకు వెంకటరమణకు ప్రెసిడెంట్‌ మెడల్‌ ఫర్‌ గేలంట్రీ పతకం దక్కింది. విజయవాడలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గురువారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ పతకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పతకం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 12:48 AM