Share News

‘ఉక్కు’ స్థలం ఆక్రమణపై 14 మందిపై కేసు నమోదు

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:41 AM

స్టీల్‌ప్లాంట్‌కు చెందిన భూమిని ఆక్రమించేందుకు కొంతమంది వ్యక్తులు పాల్పడుతున్నారని వీఎస్‌పీ అథారిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు శనివారం 14 మందిపై కేసు నమోదు చేశారు.

‘ఉక్కు’ స్థలం ఆక్రమణపై 14 మందిపై కేసు నమోదు

కూర్మన్నపాలెం,మార్చి 23: స్టీల్‌ప్లాంట్‌కు చెందిన భూమిని ఆక్రమించేందుకు కొంతమంది వ్యక్తులు పాల్పడుతున్నారని వీఎస్‌పీ అథారిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు శనివారం 14 మందిపై కేసు నమోదు చేశారు. అగనంపూడి సర్వే నంబర్‌ 56/1ఏ2/2, ఏ3/1, 2/ఏలో సుమారు 6.86 ఎకరాల స్టీల్‌ప్లాంట్‌ భూమి ఉంది. దీనిని 1990లో ఉక్కు కర్మాగారం చింతా సూర్యనారాయణరెడ్డి, పోతారెడ్డిల నుంచి సేకరించారు. అప్పటినుంచి ఈ స్థలం ఖాళీగా ఉండడంతో దీనిని తిరిగి తమకు అప్పగించాలని కోరుతూ కొంతమంది వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేయడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు యథాస్థితిని కొనసాగించమంటూ పెండింగ్‌లో పెట్టింది. కాగా ఈ స్థలాన్ని దివంగత ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎస్సీలకు ఇచ్చారని, ఈ భూమి తమకు చెందిందంటూ పలువురు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రహరీని కూల్చివేశారు. దీనిపై వీఎస్‌పీ అథారిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూ ఆక్రమణకు పాల్పడిన 14 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 24 , 2024 | 12:41 AM