ఉరకలేస్తున్న బురదగుంట జలపాతం
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:22 PM
మండలంలోని జర్జుల పంచాయతీ బురదగుంట సమీపంలో జలపాతం వరద నీటితో ఉరకలేస్తోంది.

ముంచంగిపుట్టు, జూలై 28: మండలంలోని జర్జుల పంచాయతీ బురదగుంట సమీపంలో జలపాతం వరద నీటితో ఉరకలేస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చూపరులను ఆ జలపాతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎతైన పెద్ద బండరాయిపై నుంచి ప్రవహిస్తున్న ఆ జలపాతాన్ని చూడాలంటే మండల కేంద్రం నుంచి ఆరు కిలోమీటర్లు వాహన ప్రయాణంతో పాటు ఒక కిలోమీటరు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.