Share News

58 పశువులు స్వాధీనం

ABN , Publish Date - May 29 , 2024 | 12:05 AM

మండలంలోని సీతారాంపురం జంక్షన్‌ వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న 58 పశువులను స్వాధీనం చేసుకున్నారు.

58 పశువులు స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న పశువులు

పాయకరావుపేట రూరల్‌, మే 28 : మండలంలోని సీతారాంపురం జంక్షన్‌ వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న 58 పశువులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ జోగారావు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సీతారాంపురం జంక్షన్‌ వద్ద మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా నక్కపల్లి నుంచి తుని వైపు వెళుతున్న వ్యాన్‌లో ఎటువంటి అనుమతులు లేకుండా 12 ఆవులు, 46 ఎద్దులు తరలిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనం డ్రైవరు, ఓనరుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పశువులను కొత్తవలస గోశాలకు తరలించామని ఎస్‌ఐ జోగారావు తెలిపారు.

Updated Date - May 29 , 2024 | 12:05 AM