ఐటీడీఏ పరిధిలో 40 పరీక్షా కేంద్రాలు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:25 AM
పాడేరు ఐటీడీఏ పరిధిలో పదవ తరగతి వార్షిక పరీక్షలకు 40 కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈవో పి.బ్రహ్మాజీరావు తెలిపారు.

- హాజరుకానున్న 11,940 మంది టెన్త్ విద్యార్థులు
అరకులోయ, మార్చి 5: పాడేరు ఐటీడీఏ పరిధిలో పదవ తరగతి వార్షిక పరీక్షలకు 40 కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈవో పి.బ్రహ్మాజీరావు తెలిపారు. అరకులోయలోని కంఠభౌంసుగుడ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 27వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు మొత్తం 11,940 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. బుధవారం రాత్రి పరీక్ష పేపర్లను పోలీస్ స్టేషన్లలో భద్రపరుస్తామన్నారు.
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వర్చువల్ సమావేశం
అరకులోయలోని కంఠభౌంసుగుడ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుతున్న 9, 10 తరగతి విద్యార్థులతో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ వర్చువల్‌గా మాట్లాడారు. విద్యార్థులకు అందజేసిన ట్యాబుల పనితీరు, పాఠశాలలో ఏర్పాటు చేసిన స్మార్ట్ టీవీలు, బైజూస్ విద్యా విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో బ్రహ్మాజీరావు, ఎంఈవోలు మోహన్‌రావు, భారతీరత్నం, పాఠశాల హెచ్‌ఎం రాజ్యలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.