అగనంపూడిలో రూ.3,92,500 స్వాధీనం
ABN , Publish Date - Mar 27 , 2024 | 12:24 AM
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అగనంపూడి టోల్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటడ్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం ప్లైయింగ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖీల్లో రూ.3,92,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.
కూర్మన్నపాలెం, మార్చి 26: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అగనంపూడి టోల్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటడ్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం ప్లైయింగ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖీల్లో రూ.3,92,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా తుని నుంచి విశాఖ నగరానికి కారులో వస్తున్న కోరుకొండ ఈశ్వర్ గణేశ్, సూరంపూడి చంద్రశేఖర్‌ల వద్ద ఈ నగదు లభ్యమైంది. ఇందుకు సంబంధించిన పత్రాలు ఉన్నప్పటికీ వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా వారు థాయిలాండ్ వెళ్లేందుకు గాను నగదు ఎక్స్చేంజ్ చేసేందుకు విశాఖ నగరానికి వెళుతున్నట్టు తెలిపారు. నగదుకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.