Share News

ఇంటర్‌ ఫస్టియర్‌లో 34.31 శాతం ఉత్తీర్ణత

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:41 AM

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లాలో ఇంటర్మీడియట్‌ జనరల్‌ విభాగంలో ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలకు 4,336 మంది హాజరు కాగా, వీరిలో 1,488 మంది(34.31 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్‌, ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ద్వితీయ సంవత్సర ఇంటర్‌ ఫలితాలు ఈ నెల 18న విడుదలయ్యాయి.

ఇంటర్‌ ఫస్టియర్‌లో 34.31 శాతం ఉత్తీర్ణత

ఒకేషనల్‌ కోర్సుల్లో 41 శాతం నమోదు

- అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

అనకాపల్లి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి):

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లాలో ఇంటర్మీడియట్‌ జనరల్‌ విభాగంలో ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలకు 4,336 మంది హాజరు కాగా, వీరిలో 1,488 మంది(34.31 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్‌, ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ద్వితీయ సంవత్సర ఇంటర్‌ ఫలితాలు ఈ నెల 18న విడుదలయ్యాయి.

కాగా జిల్లాలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు జనరల్‌ విభాగంలో ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలల నుంచి 130 మంది హాజరుకాగా, 94 మంది ఉత్తీర్ణులయ్యారు. బీసీ వెల్ఫేర్‌ కళాశాలల నుంచి నలుగురుకి ముగ్గురు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల నుంచి 1,439 మందిలో 451 మంది ఉత్తీర్ణులయ్యారు. అదే విధంగా హైస్కూల్‌ ప్లస్‌లో 67 మందికి 21 మంది, కేజీబీవీల నుంచి 112 మందికి 71 మంది ఉత్తీర్ణులయ్యారు. మోడల్‌ స్కూల్స్‌ నుంచి 74 మందికి 45 మంది, ప్రైవేటు కళాశాలల నుంచి 2,281 మందిలో 764 మంది, ఏఎంఏఎల్‌ నుంచి 114 మందిలో 14 మంది, ఎయిడెడ్‌ కళాశాలల నుంచి 115 మందిలో 25 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఒకేషనల్‌ కోర్సుల్లో....

ఒకేషనల్‌ విభాగంలో మొత్తం 773 మంది పరీక్షలకు హాజరు కాగా వీరిలో 317 మంది(41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి 273 మంది పరీక్షలకు హాజరు కాగా, 123 మంది ఉత్తీర్ణులయ్యారు. కేజీబీవీలో 34 మందిలో 22 మంది, ప్రైవేటు కళాశాలల నుంచి 425 మంది రాస్తే 158 మంది, ఎయిడెడ్‌ కళాశాలల నుంచి 41 మందిలో 14 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల సందర్భంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు కూడా సమాధాన పత్రాలను రీ-వెరిఫికేషన్‌కు ఇంటర్‌ బోర్డు అవకాశం ఇచ్చింది. రీ వెరిఫికేషన్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చలానా తీయాల్సి ఉంటుంది.

Updated Date - Jun 27 , 2024 | 12:41 AM