Share News

జిల్లాలో 1,222 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం

ABN , Publish Date - May 06 , 2024 | 01:14 AM

జిల్లాలో ఆదివారం 1,222 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి. కలెక్టర్‌ ఎం.విజయసునీత పర్యవేక్షణలో రిటర్నింగ్‌ అధికారులు భావనా వశిష్ఠ, వి.అభిషేక్‌, ప్రశాంత్‌కుమార్‌లు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

జిల్లాలో 1,222 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం
కంఠబౌంసుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకుంటున్న ఉద్యోగి

పాడేరు, మే 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం 1,222 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి. కలెక్టర్‌ ఎం.విజయసునీత పర్యవేక్షణలో రిటర్నింగ్‌ అధికారులు భావనా వశిష్ఠ, వి.అభిషేక్‌, ప్రశాంత్‌కుమార్‌లు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆదివారం పాడేరు నియోజవర్గంలో 387 మంది, అరకులోయలో 288, రంపచోడవరంలో 587 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఈ నెల 8వ తేదీ నాటికి అర్హత ఉన్న వారంతా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అలాగే కదల్లేని స్థితిలో వున్న పాడేరు నియోజకవర్గలోని 37 మంది, అరకులోయలో 24 మంది, రంపచోడవరంలో ఏడుగురు.. మొత్తం 68 మంది హోం ఓటింగ్‌ను వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి ఎం.విజయసునీత తెలిపారు.

అరకులోయలో..

అరకులోయ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో రోజైన ఆదివారం 288 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని అరకు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ తెలిపారు. ఆదివారం కంఠబౌంసుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్‌బ్యాలెట్‌ను నిర్వహించామన్నారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 267 మంది, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 12 మంది, ఇతర జిల్లాల నుంచి 9 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2024 | 01:14 AM