Share News

100 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:36 AM

ఒడిశా రాష్ట్రం పాడువా నుంచి మహారాష్ట్రకు కారులో తరలిస్తున్న 100 కిలోల గంజాయిని ఆదివారం సాయంత్రం పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి అరకు సీఐ రుద్రశేఖర్‌ సోమవారం విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

100 కిలోల గంజాయి స్వాధీనం
ఎస్‌ఐ సంతోశ్‌తో కలిసి వివరాలు వెల్లడిస్తున్న సీఐ రుద్రశేఖర్‌, వెనుక వైపు నిందితులు

- నలుగురి అరెస్టు

అరకులోయ, ఫిబ్రవరి 26: ఒడిశా రాష్ట్రం పాడువా నుంచి మహారాష్ట్రకు కారులో తరలిస్తున్న 100 కిలోల గంజాయిని ఆదివారం సాయంత్రం పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి అరకు సీఐ రుద్రశేఖర్‌ సోమవారం విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో డుంబ్రిగుడ మండలం జైపూర్‌ జంక్షన్‌ వద్ద ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఒడిశా వైపు నుంచి వస్తున్న కారును ఆపి తనిఖీ చేశారు. అందులో వంద కిలోల గంజాయి ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న హుకుంపేట మండలం బూరుగువలస గ్రామానికి చెందిన సంతోశ్‌కుమార్‌, పెదబయలుకు చెందిన పి.గజపతి, విశాఖపట్నం మధురవాడకు చెందిన శంకరరావు, విశాలాక్షినగర్‌కు చెందిన సురేశ్‌లను అరెస్టు చేశారు. కారును సీజ్‌ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. గంజాయి, నిందితులను పట్టుకున్న డుంబ్రిగుడ ఎస్‌ఐ సంతోశ్‌, సిబ్బందిని సీఐ అభినందించారు.

Updated Date - Feb 27 , 2024 | 12:36 AM