Share News

Chalo Vijayawada: సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడకి పోలీసులు బ్రేక్.. ఎక్కడికక్కడే అరెస్టులు

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:01 PM

శనివారం, ఆదివారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన సీపీఎస్ ఉద్యోగులకు పోలీసులు షాక్ ఇచ్చారు. వాళ్లు చేపట్టిన ఈ ఉద్యక కార్యాచరణకు అధికారులు బ్రేకులు వేశారు. చలో విజయవాడకు అనమతిలేదని తేల్చి చెప్పారు. ఒకవేళ ఛలో విజయవాడ చేపడితే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Chalo Vijayawada: సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడకి పోలీసులు బ్రేక్.. ఎక్కడికక్కడే అరెస్టులు

శనివారం, ఆదివారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన సీపీఎస్ ఉద్యోగులకు పోలీసులు షాక్ ఇచ్చారు. వాళ్లు చేపట్టిన ఈ ఉద్యక కార్యాచరణకు అధికారులు బ్రేకులు వేశారు. చలో విజయవాడకు అనమతిలేదని తేల్చి చెప్పారు. ఒకవేళ ఛలో విజయవాడ చేపడితే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు.. విజయవాడలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నాయని సీపీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే.. సీపీఎస్ ఉద్యోగులు పట్టుదలతో ఛలో విజయవాడని చేపట్టగా, ఎక్కడికక్కడే అరెస్టులు నిర్వహించారు. పలువురు సీపీఎస్ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. ఇదే సమయంలో.. ఆందోళనలో పాల్గొనవద్దని, పాల్గొంటే అరెస్టులు తప్పవంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.


మరోవైపు.. సీపీఎస్ వల్ల తాము ఎంతో నష్టపోయామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడుని సీఎం జగన్ ముందు మొరపెట్టుకుంటామని అభ్యర్థిస్తున్నా.. పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలని, సీపీఎస్ రద్దు చేయాలని కోరుతున్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. జీపీఎస్‌ని అంగీకరించమని చెప్తున్నారు. జీపీఎస్ వల్ల ఉద్యోగుల డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌గా మారుతున్నాయని.. అయితే అత్యవసర సమయాల్లో ఆ డబ్బులు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. దీనికితోడు.. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా మారిపోయాయని అన్నారు. వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ పునరుద్ధణ చేస్తామని నమ్మించి.. ఐదేళ్లుగా తమని మోసం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

సీపీఎస్ ఉద్యోగులకు తమ వేదనని, కనీస నిరసనను తెలపడానికి కూడా స్వాతంత్రం లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఉద్యోగులు తగిన విధంగా ప్రతిఫలం ఇవ్వాలని.. అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిరంకుశ విధానంతో పోలీస్ వారిని ఉపయోగించుకొని.. సీపీఎస్ ఉద్యోగులను రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో.. ఉద్యోగుల భద్రత, ప్రయోజనాల దృష్ట్యా ఛలో విజయవాడ కార్యక్రమాన్ని ఆదివారం నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు.

Updated Date - Feb 17 , 2024 | 10:01 PM