AP News: శివ భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు
ABN , Publish Date - Mar 08 , 2024 | 06:57 AM
శైవ క్షేత్రాలన్నీ శివ భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కనకదుర్గమ్మవారి సమీపంలోని భవాని జల శివాలయంలో భక్తులు పోటెత్తారు.
అమరావతి: శైవ క్షేత్రాలన్నీ శివ (Shiva) భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కనకదుర్గమ్మ (Kanakadurgamma)వారి సమీపంలోని భవాని జల శివాలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే కృష్ణా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. యనమలకుదురు శివాలయంలో తెల్లవారుజాము నుంచి గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా యనమలకుదురు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గ్రామంలోకి ద్విచక్ర వాహనాలు మినహా ఎటువంటి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ఇంద్రకీలాద్రిపై భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం, వన్ టౌన్ పాత శివాలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Srisailam: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.