Tammareddy Bharadwaj: ఏపీలో ప్రధాన పార్టీలు ముసుగేసుకుని బీజేపీని సపోర్టు చేస్తున్నాయి
ABN , Publish Date - Jan 12 , 2024 | 01:57 PM
ఈ ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉన్నా.. చాలా మంది బయటకు అభిప్రాయాలు చెప్పలేకపోతున్నారని ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. దేశంలో మహిళలు, దళితులు, మైనారిటీలపై దౌర్జన్యాలు పెరిగాయని.. రక్షణ కరువైందని అన్నారు.

విజయవాడ: ఈ ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉన్నా.. చాలా మంది బయటకు అభిప్రాయాలు చెప్పలేకపోతున్నారని ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. దేశంలో మహిళలు, దళితులు, మైనారిటీలపై దౌర్జన్యాలు పెరిగాయని.. రక్షణ కరువైందని అన్నారు. మణిపూర్‌లో అంత దారుణం జరిగితే.. 70 రోజుల తర్వాత కూడా మాట్లాడలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆ ఘటనలపై ఎదురు దాడి చేయడం చూస్తే.. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు.
పద్మావతి అనే సినిమా సీఎంకు వ్యతిరేకంగా ఉందని ఆరోజు అడ్డుకున్నారని తమ్మారెడ్డి అన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధానాన్ని ఖండించలేదన్నారు. ఆడవాళ్లను గౌరవించని, దళితులను గౌరవించని బీజేపీ తనకు అక్కర్లేదన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా తెలుగు వాళ్లను మోసం చేసిన బీజేపీ అవసరమా? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ హఠావో.. అక్కర్లేదని.. ఏపీలో బీజేపీని అసలు రానివ్వరన్నారు కానీ ఇక్కడ ఉన్న ప్రధాన పార్టీలు మాత్రం ముసుగు వేసుకుని బీజేపీని సపోర్టు చేస్తున్నాయన్నారు. కాబట్టి ఇటువంటి వారిలో మార్పు అయినా రావాలి... లేదంటే ప్రజలే ఓడించాలని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.