Share News

Palar Project: పాలార్ ప్రాజెక్ట్ వివాదం.. సీఎం జగన్ ప్రకటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:12 PM

కుప్పం, తమిళనాడు సరిహద్దుల్లోని పాలార్ ప్రాజెక్ట్ వివాదం (Palar Project Controversy) మళ్లీ తెరమీదకి వచ్చింది. ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) చేసిన ప్రకటన కారణంగా.. ఈ వివాదం మరోసారి అగ్గిరాజుకుంది. ఇటీవల కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో భాగంగా.. 0.6 టీఎంసీల కెపాసిటీతో రూ.215 కోట్ల వ్యయంతో చిన్నపాటి రిజర్వాయర్‌ను (Reservoir) పాలార్ ప్రాజెక్ట్‌పై నిర్మిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

Palar Project: పాలార్ ప్రాజెక్ట్ వివాదం.. సీఎం జగన్ ప్రకటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్

కుప్పం, తమిళనాడు సరిహద్దుల్లోని పాలార్ ప్రాజెక్ట్ వివాదం (Palar Project Controversy) మళ్లీ తెరమీదకి వచ్చింది. ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) చేసిన ప్రకటన కారణంగా.. ఈ వివాదం మరోసారి అగ్గిరాజుకుంది. ఇటీవల కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో భాగంగా.. 0.6 టీఎంసీల కెపాసిటీతో రూ.215 కోట్ల వ్యయంతో చిన్నపాటి రిజర్వాయర్‌ను (Reservoir) పాలార్ ప్రాజెక్ట్‌పై నిర్మిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు కూడా ఇచ్చేశామని చెప్పిన ఆయన.. శాంతిపురం మండలం గణేష్‌పురం వద్ద పాలార్ నదిపై దీనిని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ విధంగా జగన్ చేసిన ప్రకటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అంతర్రాష్ట్ర నదిపై ప్రాజెక్టు నిర్మాణం సరికాదని, దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తుండగానే ఇలాంటి ప్రకటన చేయడం తప్పని తమిళనాడు నీటిపారు శాఖ మంత్రి దొరై మురుగన్ (Dorai Murugan) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీరుని తాము ఖండిస్తున్నామని ప్రకటన కూడా విడుదల చేశారు. అంతేకాదు.. ఈ వ్యవహారంపై తమిళనాడు రాష్ట్ర రైతులు, గ్రామీణ ప్రజలు ఆందోళనకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. సొంత ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఈ పాలార్ ప్రాజెక్ట్ అంశాన్ని తెరమీదకి తెచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


పాలార్ నది వివాదం:

పాలార్ నదిపై 1956 అంతరాష్ట్ర నది నీటి వివాదాల చట్టం అమలులో ఉంది. ఒప్పంద నిబంధనల ప్రకారం.. ఎగువ రాష్ట్రం, దిగువ రాష్ట్ర అనుమతి లేకుండా నదీ జలాలను అడ్డుకోవటానికి, మళ్లించడానికి లేదా నిల్వ చేయడానికి.. అలాగే కొత్త ఆనకట్ట నిర్మాణం లేదా నిర్మాణ ఎత్తు పెంచడానికి అనుమతులు లేకుండా చేయకూడదు. అయితే.. పాలార్ నదిపై ఏపీ ప్రభుత్వం నీటిపారుదల ఆనకట్టని నిర్మించాలని చూస్తోంది. ఇదే అంశం.. పాలార్ నది వల్ల లబ్ది పొందుతున్న తమిళనాడులోని వెల్లూర్, కాంచీపురం, తిరువన్నమలై, తిరువళ్లూరు, చెన్నై ప్రజల ఆందోళనకు కారణమైంది.

Updated Date - Feb 27 , 2024 | 11:12 PM