Share News

Sujana Chowdary: ఈసారి విజయవాడ నుంచి పోటీ చేస్తా..

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:37 PM

ఈసారి బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తానని ఆ పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి తెలిపారు. పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. విజయవాడ నుంచి బీజేపీ పోటీ చేస్తే తన గెలుపు ఖాయమన్నారు.

Sujana Chowdary: ఈసారి విజయవాడ నుంచి పోటీ చేస్తా..

ఢిల్లీ : ఈసారి బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తానని ఆ పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి తెలిపారు. పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. విజయవాడ నుంచి బీజేపీ పోటీ చేస్తే తన గెలుపు ఖాయమన్నారు. అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుందని సుజనా చౌదరి స్పష్టం చేశారు.

తమ అధిష్టానం కూడా అమరావతికి అనుకూలమేనన్నారు. ఏపీ రాజ్యసభ ఎన్నికలపై బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సుజనా చౌదరి అన్నారు. ఏపీలో ఈ సారి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకుంటుందన్నారు. వలంటీర్లను ఎన్నికల విధులకు ఈసీ దూరంగా ఉంచడం హర్షణీయమని సుజనా చౌదరి పేర్కొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 01:37 PM