Share News

జడ్పీ చైర్‌పర్సన్‌ రాజీనామా చేయాలి

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:08 AM

నకిలీ బెంతుఒరియాలకు కొమ్ము కాస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ తక్షణం రాజీనామా చేయాలని ఆది వాసీ సంక్షేమ పరిషత్‌ డి మాండ్‌ చేసింది. ఈ మేరకు నీలమణిదుర్గ ఆలయ సమీపం లో ఆదివారం నిరసన తెలిపారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ రాజీనామా చేయాలి
నినాదాలు చేస్తున్న ఆదివాసీ నాయకులు

పాతపట్నం: నకిలీ బెంతుఒరియాలకు కొమ్ము కాస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ తక్షణం రాజీనామా చేయాలని ఆది వాసీ సంక్షేమ పరిషత్‌ డి మాండ్‌ చేసింది. ఈ మేరకు నీలమణిదుర్గ ఆలయ సమీపం లో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న నకిలీ బెంతుఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చకూడదని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యో గాలు చేస్తున్న వారిని వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్య క్షుడు వాబ యోగి, జిల్లా కార్య దర్శి బి.సింహాచలం, సలహాదారు అజారి రామారావు, నేతలు ఆసరి కర్ణారావు, సుందరాడ తవిటి నాయుడు, కొరసండ మిన్నారావు, డొల్లు శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:09 AM