Share News

యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:31 AM

వీరభద్రాపురం గ్రామానికి చెందిన సనపల వెంకటరమణ(23) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ బి.నిహార్‌ తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

సరుబుజ్జిలి: వీరభద్రాపురం గ్రామానికి చెందిన సనపల వెంకటరమణ(23) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ బి.నిహార్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. వెంకటరమణ దుబారా ఖర్చులకు అలవాటు పడి వివిధ ప్రాంతాల్లో అప్పులు చేశా డు. ఈనేపథ్యంలో రుణబాధలు తట్టుకోలేక నిత్యం మనోవేదనతో ఉండేవాడు. శని వారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన తమ కుమారుడు ఆదివారం ఉదయానికి సరుబుజ్జిలికి సమీపంలో ఉన్న జీడితోటలో చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందినట్టు తల్లి సనపల వజ్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహానికి శ్రీకాకుళం రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించి, అనంతరం కుటుంబ సభ్యుల కు అప్పగించారు. కాగా వెంకటరమణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు భార్యతోపాటు మూడు నెలల కుమార్తె కూడా ఉంది.

మేడపై నుంచి జారి పడి యువకుడి మృతి

పలాస రూరల్‌: పలాస మండలం తర్లాకోట క్వారీలో పని చేస్తున్న సవర ప్రకాశ్‌ (34) శనివారం రాత్రి మేడపై నిద్రిస్తూ ప్రమాదవశాత్తు జారి మృతి చెందిన ట్లు క్వారీ నిర్వాహకుడు పెంట బాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన విషయాన్ని ఆదివారం రాత్రి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన వాడన్నారు. ఎస్‌ఐ పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:31 AM