Share News

క్రీడల్లో యువత రాణించాలి

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:12 AM

Youth should excel in sports సమాజంలో రోజురోజు కు పెరుగుతున్న ఉపా ధి అవకాశాల పోటీల్లో ఎంతో ప్రాధాన్యం కలి గిన క్రీడల్లో యువత రాణించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

క్రీడల్లో యువత రాణించాలి
ఎమ్మెల్యే రవికుమార్‌ను సత్కరిస్తున్న జిల్లా పీఈటీలు

- సాఫ్ట్‌బాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్‌

శ్రీకాకుళం స్పోర్ట్స్‌/ ఆమదాలవలస, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): సమాజంలో రోజురోజు కు పెరుగుతున్న ఉపా ధి అవకాశాల పోటీల్లో ఎంతో ప్రాధాన్యం కలి గిన క్రీడల్లో యువత రాణించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. శుక్రవారం విజయవాడలో శాప్‌ చైర్మన్‌ ఎ.రావినాయుడు ఆధ్వర్యంలో నిర్వ హించిన సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన రవికుమార్‌ను ఘనంగా సత్కరించా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అభివృద్ధితో పాటు పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్‌ సీఈవో సి.వెంకటేషులు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎంవీ రమణ, ట్రెజరర్‌ నర్సింరెడ్డి, ఏపీపీఈటీ సంఘం గౌరవ అధ్యక్షుడు కరిముల్లా చౌదరి, కార్యదర్శి సి.నాగేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:12 AM