Share News

వైసీపీకి సమాధి కట్టాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:44 PM

రానున్న ఎన్నికల్లో వైసీపీకి శాశ్వతంగా సమాధి కట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈసారి ఎన్ని కల్లో వైసీపీ తరపున పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీచేసేందుకు సిద్ధప డుతున్న అభ్యర్థికి ఢిల్లీ సెంటర్‌లో వదిలితే కనీసం పార్లమెంట్‌కు చేరుకో గలడా అని ప్రశ్నించారు. మంగళవారం రావివలస ఎన్నికల ప్రచా రసభలో ఆయన మాట్లాడుతూ ఇంగ్లీష్‌, హిందీ వంటి ప్రధాన భాషలు రాని వ్యక్తులు పార్లమెంట్‌లో ఏమి మాట్లాడగలరని ఎద్దేవాచేశారు.

 వైసీపీకి సమాధి కట్టాలి
టెక్కలి: రావివలసలో అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరుతున్న వైసీపీ కార్యకర్తలు:

టెక్కలి: రానున్న ఎన్నికల్లో వైసీపీకి శాశ్వతంగా సమాధి కట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈసారి ఎన్ని కల్లో వైసీపీ తరపున పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీచేసేందుకు సిద్ధప డుతున్న అభ్యర్థికి ఢిల్లీ సెంటర్‌లో వదిలితే కనీసం పార్లమెంట్‌కు చేరుకో గలడా అని ప్రశ్నించారు. మంగళవారం రావివలస ఎన్నికల ప్రచా రసభలో ఆయన మాట్లాడుతూ ఇంగ్లీష్‌, హిందీ వంటి ప్రధాన భాషలు రాని వ్యక్తులు పార్లమెంట్‌లో ఏమి మాట్లాడగలరని ఎద్దేవాచేశారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పది రూపాయల బటన్‌ నొక్కి వంద రూపా యలు బుక్కుతున్నాడన్నారు. ఐదేళ్లలో ఈ ప్రభుత్వం వంశధారపై ఒక్క రూపాయి అయినా ఖర్చు చేసిందా అని ప్రశ్నించారు. రావివలసకు తాము అధికారంలోకి వచ్చిన తరువాత డబుల్‌రోడ్డు, సెంటర్‌ లైటింగ్‌తో తీర్చిదిద్దుతామన్నారు. ఎండలమల్లన్న ఆలయ అభివృద్ధి తన హయాం లో జరిగిందే తప్ప ఈ ఐదేళ్లలో ఏమి జరిగిందని ప్రశ్నించారు.

వైసీపీ నుంచి 50 కుటుంబాలు చేరిక

రావివలసలో 50 కుటుంబాలు వైసీపీని వీడి అచ్చెన్నాయుడు సమ క్షంలో టీడీపీలోచేరాయి. అప్పిని ఢిల్లేశ్వరరావు, అట్టాడ రమణయ్య, కొర్రా యి వెంకటేష్‌, అంకుల విజయ్‌కుమార్‌, రాపల్లి నాగభూషన్‌, బులకల రాంబాబు, వెంకటేష్‌, డొంకాన ఢిల్లేశ్వర్‌, ప్రదీప్‌, రామచంద్రారెడ్డి, పందిరి లోకేష్‌ తదితరులకు పార్టీ కండువాలు కప్పి అచ్చెన్నా యుడు ఆహ్వానిం చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎల్‌ఎల్‌ నాయుడు, లమ్మత లక్ష్మి, బోయిన గోవిందరాజులు, బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్‌, బోయిన రమేష్‌, జీరు భీమారావు, హనుమంతు రామకృష్ణ, చాపర గణ పతి, మట్ట పురుషోత్తం, దమయంతి, తర్ర రామకృష్ణ, వెలమల విజయ లక్ష్మి, కోళ్ల కామేసు, లవకుమార్‌, మామిడి రాము, కింగ్‌, బడే జగదీష్‌, నర్తు కృష్ణ, పశుపతి, హనుమంతు అప్పలరాజు, జగదీష్‌ పాల్గొన్నారు.

ఫకోటబొమ్మాళి/సంతబొమ్మాళి: కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడక్యాంపు కార్యాలయంలో టీడీపీరాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. సంతబొమ్మాళి మండలంలోని ఆకాశ లక్కవరం పంచాయతీకి చెందిన సగ్గు రమేష్‌ ఆయన అనుచర కుటుం బాలు, టెక్కలి మండలంలోని సన్యాసిపేట నుంచి జెన్ని లచ్చయ్య, సిం గువలస సింహాచలం, పున్నయ్య, జన్ని మనోజ్‌ కుమార్‌, మధు, దిలీప్‌, వెంకటేష్‌, దుర్గారావు, మధు తదితర 25 కుటుంబాలు చేరాయి. సంతబొ మ్మాళి మండలంలోని మూలపేట పంచాయతీ విషుచక్రం గ్రామానికి చెందిన జీరు బాబురావు, జీరు శ్యామలరావు, గిన్ని శ్రీను తదితరులు పార్టీలో చేరారు. కార్య క్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు అట్టాడ రాంప్ర సాద్‌, జీరు సుందరరావు, కోట నారంనాయుడు పాల్గొ న్నారు. అలాగే కోటబొమ్మాళి మండ లంలోని హరిశ్చంద్రపురం పంచాయతీ హరిశ్చంద్రపు రం, వింజాంపాడు తదితర గ్రామాలకు చెందిన నాయ కులు, కార్యకర్తలు అచ్చెన్నాయుడు కలిసి సమస్యలు తెలియజేశారు కార్యక్రమంలో నాయకులు పూజారి శైలజ, ఉప్పాడ జయరాం పాల్గొన్నారు. అలాగే టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలంలో పలు గ్రామాలకు చెందిన నాయకులు కలిశారు.

Updated Date - Jan 30 , 2024 | 11:44 PM