Share News

సీఎం పర్యటనలో వైసీపీ నేత రచ్చ

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:26 AM

సీఎం జగన్మోహన్‌ రెడ్డి జిల్లా పర్య టనలో బుధవారం స్థానిక కొత్తరోడ్‌ సమీపంలోని గోపీనగర్‌ వద్ద హైవేపై నగర పరిధిలోని బొందిలీపురానికి చెందిన వైసీపీ నేత ఎండ రమేష్‌ రచ్చ చేశాడు.

సీఎం పర్యటనలో వైసీపీ నేత రచ్చ

భద్రతా సిబ్బంది, పోలీసులతో వాగ్వాదం

శ్రీకాకుళం అర్బన్‌: సీఎం జగన్మోహన్‌ రెడ్డి జిల్లా పర్య టనలో బుధవారం స్థానిక కొత్తరోడ్‌ సమీపంలోని గోపీనగర్‌ వద్ద హైవేపై నగర పరిధిలోని బొందిలీపురానికి చెందిన వైసీపీ నేత ఎండ రమేష్‌ రచ్చ చేశాడు. సీఎం భద్రతా దళా లతో వాగ్వాదానికి దిగాడు. వివరాలిలా ఉన్నాయి.. సీఎం జగన్‌ టెక్కలిలో నిర్వహించనున్న సిద్ధం ముగింపు సభకు అక్కివలస క్యాంప్‌ నుంచి బస్సులో హైవే మీదుగా కొత్తరోడ్‌ సమీపంలోని గోపీనగర్‌ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ సీఎంను కలిసేందుకు స్పీకర్‌ తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు వచ్చా రు. పోలీసులు, బందోబస్తు బృందం రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసి రోప్‌లను దాటి బస్సుకు అడ్డంగా నిలబడి ఆయ నకు అభివాదం చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఉదయం 11.30 గంటల సమయంలో సదరు వైసీపీ నేత ఎండ రమేష్‌, శ్రీకాకుళానికి చెందిన డివిజన్‌ ఇన్‌చార్జులు తామేం తక్కువ కాదంటూ పోలీసులను, సీఎం భద్రతా దళా న్ని దాటుకుని జగన్‌ను కలిసే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారి గందరగోళం నెలకొంది. పోలీసులంతా అప్రమత్త మై బస్సును అడ్డంగా ఉన్న ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

ఇదే సమయంలో తాను వైసీపీ నేతనని, సీఎంను కలవ కుండా ఎలా అడ్డుకుంటారని ఎండ రమేష్‌ బందోబస్తు నిర్వ హిస్తున్న పోలీసులు, సీఎం భద్రతాదళంతో వాగ్వాదానికి దిగా డు. సీఎం నుంచి ఆదేశా లొస్తే కానీ ఎవరినీ పంపలేమని చెప్పినా వినిపించుకోకుండా గొడవకు దిగాడు. వివాదం పెద్ద ది అవుతుండడంతో శ్రీకాకుళం సీఐ ఎల్‌.సన్యాశినాయుడు కలుగజేసుకుని వెంటనే పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.

Updated Date - Apr 25 , 2024 | 12:26 AM