Share News

వామ్మో.. ఇవేం రోడ్లు

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:47 PM

మండలం బొంతుపేట నుంచి మెట్టవలస వెళ్లే బీటీ రహదారి భారీ గుంత లతో ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి వర్షం కురిసినా గుం తల్లో నీరు చేరుతోంది.

వామ్మో.. ఇవేం రోడ్లు
లావేరు: ప్రమాదకరంగా మారిన మెట్టవలస రహదారి

లావేరు: మండలం బొంతుపేట నుంచి మెట్టవలస వెళ్లే బీటీ రహదారి భారీ గుంత లతో ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి వర్షం కురిసినా గుం తల్లో నీరు చేరుతోంది. అటు వై పుగా వచ్చే ప్రయాణికులు ఈ గుం తల్లో పడి తరచూ ప్రమా దాలకు గురవుతున్నారు. రాత్రి సమయంలో బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో మెట్టవలస, బుడతవలస, గుమడాం, వాళ్లెపేట, సూర్యనా రాణపురం, నీలాపురంతో పాటు మరో పది గ్రామాల ప్రజలకు ఇదే ప్రధాన రహదారి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

చినుకుపడితే చిత్తడే

వజ్రపుకొత్తూరు: బాతుపురం నుంచి రాజాం గ్రామం వరకు ఉన్న గ్రావెల్‌ రోడ్డు చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారు తోంది. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజాం కాలనీ నుంచి రాజాం వరకు తారురోడ్డు నిర్మాణం చేపట్టారు. రాజాం నుంచి బాతుపురం రోడ్డును కూడా కొంతభాగం తారు రోడ్డు నిర్మించా రు. మిగిలిన సుమారు కిలోమీటరు గ్రావెల్‌ రోడ్డు వేసేందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు చేసినా ఫలితం కనిపిం చలేదు. ఈ రోడ్డుపై నుంచి 10 గ్రామాల ప్రజలు రాకపో కలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మా ణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

వర్షం కురిస్తే నరకమే..

ఎల్‌ఎన్‌ పేట: లక్ష్మీనర్సు పేట జంక్షన్‌ నుంచి ఫాక్స్‌ దొరపేట మీదుగా బొత్తాడసిం గి గ్రామానికి వెళ్లే రోడ్డుపై రా కపోకలు సాగించాలంటే నరక యాతన పడాల్సివస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం వర్షం పడినా రోడ్డుపై ఉన్న గుంత ల్లో నీరు చేరి రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. గోతుల్లో వాహనాలు దిగబడి పాడవు తున్నాయని, వాహనదారులు గాయాల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొత్తాడసింగి, జాడుపేట, సరడాం, ఫాక్స్‌దొరపేట గ్రామాలతోపాటు కొండ శివారులోని పలు గిరిజన గ్రామాల ప్రజలు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

రోడ్లపైనే నీరు

గార: మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి చాలా గ్రామాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచి పోయింది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే గార, చింతాడ రోడ్డులో ఉన్న బూరవెల్లి, పూరస్లపాడు గ్రామాల్లో వద్ద నీరు నిలి చిపోవడంతో ఆయా గ్రామ స్థులతోపాటు వాహనచో దకులు ఇబ్బందిపడుతు న్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 03 , 2024 | 11:47 PM