అధ్వానంగా నాగావళి నది
ABN , Publish Date - Nov 11 , 2024 | 12:04 AM
మురికినీరు.. చుట్టూ చెత్తాచెదారాలతో శ్రీకాకుళంలోని నాగావళి నది అధ్వానంగా దర్శనమిస్తోంది.
- మురికినీటిలో దీపారాధన
శ్రీకాకుళం కల్చరల్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మురికినీరు.. చుట్టూ చెత్తాచెదారాలతో శ్రీకాకుళంలోని నాగావళి నది అధ్వానంగా దర్శనమిస్తోంది. కార్తీకమాసం వచ్చిందంటే చాలు.. భక్తులు వేకువజామున నదీ స్నానం ఆచరించి.. అరటిదొప్పలతో నేతిదీపాలు నదిలో విడిచిపెట్టి పూజలు చేస్తారు. కాగా.. శ్రీకాకుళంలోని ఉమారుద్ర కోటేశ్వరాలయం సమీపాన నాగావళి నది అధ్వానంగా ఉండడంతో మురికినీటిలో దీపారాధన చేయాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో చెత్తాచెదారాల కారణంగా దుర్గంధం వెదజల్లుతోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి నాగావళి పరిసర ప్రాంతాలను బాగుచేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.