Share News

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:54 PM

ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయనున్నట్టు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు.

మత్స్యకారుల సంక్షేమానికి కృషి
ర్యాలీలో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్‌, గొండు శంకర్‌

- ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

గార: ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయనున్నట్టు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. మంగళవారం రాత్రి బందరువాని పేటలో ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. ఇక్కడ రెండు జెట్టీల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తొలుత గార పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బందరువానిపేట వరకు సాగింది. కార్యక్రమంలో కూటమి నాయకులు పీస వెంకటరమణమూర్తి, బడగల వెంకట ప్పారావు, జీవీ రమణమూర్తి, గుండ భాస్కరరావు, కె.ఆదినారాయణ, శవ్వాన ఉమామహేశ్వరి, పైడి వేణుగోపాలం, చల్లా వెంకటేశ్వరరావు, కెప్టెన్‌ మైలపల్లి జనార్దనరావు, గుంటు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబును కలిసిన శంకర్‌

అరసవల్లి: పలాస పర్యటనకు విచ్చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గొండు శంకర్‌ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులను కలుపుకుంటూ ముందుకు వెళ్లాలని, అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని పార్టీ అధినేత చెప్పినట్టు శంకర్‌ తెలిపారు.

- శ్రీకాకుళం రూరల్‌: రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిన జగన్‌రెడ్డికి రానున్న ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని గొండు శంకర్‌ సతీమణి స్వాతి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సింగుపురం పంచాయతీ పల్లివలస గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. మాజీ సర్పంచ్‌ గుండ మోహన్‌రావు, కంచు చిన్నారావు, కంచు దశరధుడు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమల అభివృద్ధితోనే ఉపాధి: ఎన్‌ఈఆర్‌

రణస్థలం: పరిశ్రమలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, స్థానిక యవతకు ఉపాధి కల్పించడమే తన ధ్యేయమని ఎచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ కూటమి అభ్యర్థి నదుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) అన్నారు. ఆత్మీయ కలయకలో భాగంగా మంగళవారం దేరసాం, వెంకటరావుపేట, చిల్లపేటరాజం, మెంటాడ, నారువ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న నిరుద్యోగ యువతకు స్థానిక పరిశ్రమల్లో పూర్తి స్థాయిలో ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పైడి వేణుగోపాలరావు, పిషిని జగన్నాఽథంనాయుడు, పైడి అప్పడదొర, లంక ప్రభ, శ్యామ్‌, గొర్లె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

కూటమితోనే రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే అశోక్‌

కవిటి: కూట మితోనే రాష్ట్రాభి వృద్ధి సాధ్యమని ఇచ్ఛాపురం నియో జకవర్గ ఎమ్మెల్యే బి.అశోక్‌ తెలిపారు. మంగళవారం కవి టిలో జనసేన నేత లు దాసరి రాజు, లోళ్ల రాజేష్‌లతో పాటు ఎమ్మెల్యే అశోక్‌, సతీమణి నీలోత్పల ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అథోగతిపాలు చేసి అన్నివర్గాలపై జగన్‌రెడ్డి భారం వేశాడ ని ఆరోపించారు ఎన్నికల్లో సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నాడన్నారు. కార్య క్రమంలో నాయకులు మణి చంద్రప్రకాష్‌, పి.కుమారి, బి.రమేష్‌, పి.కృష్ణారావు, బి.చిన్నబాబు, బి.తిరుమలరావు, ఎ.రాజు, బి.కామరాజు, వి.రంగారావు, కె.వాసు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో వైసీపీ నాయకుడు చేరిక

సోంపేట: పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు, ఎంపీటీసీ భర్త వైశ్యరాజు వెంకట రమణ పలాసలో చంద్రబాబు నా యుడు సమ క్షంలో టీడీపీలో చేరారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషిచేస్తానని తెలిపారు.

చంద్రబాబుతోనే మంచి రోజులు

పొందూరు: చంద్రబాబును తిరిగి ముఖ్య మంత్రిని చే యడం ద్వారానే రాష్ట్రానికి మంచి రోజులు వస్తా యని ఆమదాల వలస నియోజ కవర్గ టీడీపీ అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. మంగళవారం మేజరు పంచాయతీ పొందూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహరాజా మార్కెట్‌లో వ్యాపారులతో మాట్లాడారు. కార్యక్రమంలో కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పేడాడ రామ్మోహన్‌, టీడీపీ మండల అధ్యక్షుడు రామ్మోహ న్‌, నాయకులు కె.సత్యనారాయణ, అన్నెపు రాము, వండాన మురళి, అనకాపల్లి చినరంగ, బలగ శంకరభాస్కర్‌, బాడాన గిరి, ఎంపీటీసీలు బాడాన హారిక, ఎ.వాణి, మాజీ సర్పంచ్‌ అనకాపల్లి విజయలక్ష్మికె. శ్రీనివాసరావు, ఎం. శ్రీనివాస రావు, సీతారామా రావు, పప్పల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:54 PM